ఓ పెద్ద సినిమా అంటే హీరోయిన్ పాత్రలకూ మంచి పేరు వస్తుందని చాలామంది భావిస్తుంటారు. అలాగే ఆమె నటన కూడా ఆకట్టుకుంటుందని ఆశిస్తారు. బట్ పెద్ది విషయంలో ఇదేం కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన జాన్వీ కపూర్ గురించి మూవీ టీమ్ అస్సలే మాత్రం పట్టించుకోవడం లేదు అని చాలామంది అనుకుంటున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒకటి క్రికెటర్. మరోటి కుస్తీపోటీదారుడు. ఈ రెండిటిలో జాన్వీ క్రికెటర్ ను ప్రేమించే పాత్రలో నటించిందని అర్థం అవుతుంది. బట్ ఈ మూవీ రిలీజ్ కు దగ్గర పడుతున్నా కూడా ఈ మూవీలో ఆమె పాత్ర గురించి అస్సలే మాత్రం చెప్పడం లేదు. అసలే మాటకొస్తే ఆమెనే పూర్తిగా లైట్ తీసుకున్నారా అనిపిస్తోంది
ఈ మూవీ నుంచి ఇప్పటికి విడుదలైన రెండు పాటల్లో ఒకదానిలో జాన్వీ కనిపిస్తుంది. కానీ క్రెడిట్ మొత్తం చరణ్ కే వెళ్లిపోయింది. తన ఫస్ట్ మూవీ దేవరలో కూడా మంచి పాత్ర అయితే కాదు. కనీసం దేవరలో ఓ రెండు పాటల్లో తను షైన్ అయింది. అది కూడా రిలీజ్ కు ముందే. పెద్ది విషయంలో అది కనిపించడం లేదు. ఈ మూవీలో ఆమె ఓ ఎమ్మెల్యే కూతురుగా నటించబోతోంది అని చెబుతున్నారు. అది కూడా ఎంత వరకు నిజమో అనేది తెలియాల్సి ఉంది. ఓ వైపు ఈ మూవీ టీమ్ నుంచి వరుసగా ఇంటర్వ్యూస్ అయితే వస్తున్నాయి. టెక్నికల్ టీమ్ నుంచే తెగ ఇంటర్వ్యూస్ వినిపిస్తున్నాయి. వాళ్లు మాత్రం మూవీ విషయంలో అద్భుతం అని చెబుతున్నారు. రామ్ చరణ్ సూపర్బ్ అంటున్నారు తప్ప.. ఎవ్వరు కూడా జాన్వీ కపూర్ గురించి పట్టించుకోవడం లేదు. ఆమెకు సంబంధించిన విశేషాలేం చెప్పడం లేదు. అసలా మాటకొస్తే ఇంటర్వ్యూస్ చేసేవారు కూడా జాన్వీని పట్టించుకోవడం లేదు అన్నట్టుగా ఉంది సిట్యుయేషన్. ఓ రకంగా ఇది ఆమెకు అవమానమే. కాకపోతే ట్రైలర్ లాంచింగ్ వస్తుందో లేక భోపాల్ విడుదల చేయబోయే పాట ఈవెంట్ కు అయినా వస్తుందో అని చాలామంది అనుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పటికైతే జాన్వీ కపూర్ ను పెద్ది టీమ్ పూర్తిగా లైట్ తీసుకుంది అనేది మాత్రం అర్థమవుతోంది.
Cinema
పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా
Quick Summary:
ఈ మూవీలో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒకటి క్రికెటర్. మరోటి కుస్తీపోటీదారుడు. ఈ రెండిటిలో జాన్వీ .. క్రికెటర్ ను ప్రేమించే పాత్రలో నటించిందని అర్థం అవుతుంది