Sat, May 23, 2026
YouTube
Rivx Studios
News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య - Rivx Studios
Sports

పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య

Published on May 22, 2026 at 8:18 PM

1,608 Views

News Image
Quick Summary:

కావ్య పాల పెళ్లి పీటలు ఎక్కబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌కు సూపర్ క్రేజ్. అభిమానులు ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. ఈ క్రమంలో కావ్య మారన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. అతి త్వరలోనే ఈ అమ్ముడు పెళ్లి పీటలు ఎక్కబోతుందంట. ఇంతకూ వరుడు ఎవరంటే.. దాదాపు దక్షిణాది అంతా తెలిసిన ప్రముఖ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

అసలు వీరిద్దరికీ పెళ్లి అనే వార్తలకు గతేడాదిలోనే బీజం పడింది. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఏడాది నుంచి పుకార్లు షికారు చేస్తున్నాయి. పోయిన సంవత్సరం వీరిద్దరూ న్యూయార్క్‌లో జంటగా కనిపించడంతో వీరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో వీరిద్దరి గురించి నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. గతేడాదే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు రాగా.. అనిరుధ్ వీటిని కొట్టి పారేశారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి వీరిద్దరి పెళ్లి వార్తలు తెరమీదకు వచ్చాయి.

తాజాగా ఓ నివేదిక వెల్లడించిన సమాచారం ప్రకారం.. కావ్య మారన్, అనిరుధ్ ఇరువురి కుటుంబాలు వీరి పెళ్లికి ఆమోదం తెలిపాయని.. స్పెయిన్‌లో వీరి వివాహం జరిపించాలని ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక వీరి వివాహానికి సంబంధించిన వైరల్ అవుతోన్న వార్తల్లో ఒకటి మాత్రం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.

మరో క్రేజీ లీక్ ఏంటంటే.. అనిరుధ్ రవిచందర్‌కు వరుసకు మావయ్య అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ వీరి వివాహం కోసం స్వయంగా రంగంలోకి దిగారని తమిళ మీడియా కోడై కూస్తోంది. రజనీకాంత్ స్వయంగా కళానిధి మారన్‌తో మాట్లాడి అనిరుధ్-కావ్యల పెళ్లి జరిపించాలని కోరారని.. రెండు వైపులా ఉన్న పెద్దలు వీరి వివాహానికి ఆమోదం తెలిపారని తమిళ మీడియా వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.. అయితే, ఈ విషయాలపై సన్ నెట్‌వర్క్ కానీ, ఇటు అనిరుధ్ కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు. అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఈ పుకార్లకు మరో ముఖ్య కారణం కావ్య మారన్ తండ్రి, మీడియా మొఘల్ కళానిధి మారన్‌కు చెందిన సన్ పిక్చర్స్ బ్యానర్‌లో.. అనిరుధ్ వరుసగా పెద్ద సినిమాలకు మ్యూజిక్ అందిస్తుండటం.. ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది.

ఈ వార్తలు పక్కన పెడితే.. ప్రస్తుతం వీరిద్దరూ తమ కెరీర్ మీదనే పూర్తిగా దృష్టి సారించారు. అనిరుధ్ ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్‌గా.. జైలర్ 2, జననాయగన్, షారూఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ వంటి భారీ పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు, కావ్య మారన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ పనులతో పాటు, ఇటీవల సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఈస్టర్న్ కేప్ టీమ్ వరుసగా టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించి బిజినెస్ ఉమెన్‌గా బిజీగా గడుపుతున్నారు.
Author Avatar
Verified Staff Journalist kiran varra1985@gmail.com