Sat, May 23, 2026
YouTube
Rivx Studios
News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ - Rivx Studios
Celebrity

రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్

Published on May 22, 2026 at 8:14 PM

4,199 Views

News Image
Quick Summary:

కంగనా రనౌత్ రహస్యంగా వివాహం చేసుకున్నారా.. అందుకే మెడలో మంగళసూత్రం ధరించారా

ఈ రోజంతా మీడియా, సోషల్ మీడియాలో హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ గురించి ఓ వార్త తెగ వైరల్ అయ్యింది. ఇంతకు ఆ వార్త ఏంటంటే.. బాలీవుడ్ క్వీన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని వాటి సారాంశం. అందుకు కారణం.. శుక్రవారం నాడు కంగనా రనౌత్ మెడలో మంగళసూత్రం, ఆకుపచ్చ గాజులు (సాంప్రదాయకంగా వివాహిత మహిళలు ధరించేవి) ధరించిన ఫోటోలు వైరల్ కావడంతో కంగనా రహస్యంగా పెళ్లి చేసుకుంది అంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై కంగనా స్పందిస్తూ అసలేం జరిగిందో వివరించారు. ఈ వైరల్ ఫోటోపై కంగనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా క్లారిటీ ఇచ్చారు. “కంగనా రనౌత్ రహస్యంగా వివాహం చేసుకుందా?” అని హిందీలో ఉన్న ఒక పోస్ట్‌ను ఆమె షేర్ చేశారు. ఆ తర్వాత.. “నేను ప్రతిరోజూ నగరం, పరిసర ప్రాంతాలలో షూటింగ్‌లో పాల్గొంటున్నాను. సినిమాలో నేను చేయబోయే క్యారెక్టర్ గెటప్ లో ఉన్నప్పుడు ఎవరో నాకు తెలియకుండా ఫోటోలు తీశారు. వీటిల్లో నేను మెడలో మంగళసూత్రం, చేతికి ఆకుపచ్చ గాజులు ధరించాను. ఇంకేముంది చాలా సేపటి నుంచి నాకు వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అన్నింటి సారాంశం ఒక్కటే. నేను రహస్యంగా వివాహం చేసుకున్నాను అని. అసలు వివాహిత గెటప్ లో కనిపిస్తే అంత పెద్ద రచ్చ చేయాలా?” అంటూ కంగనా అసహనం వ్యక్తం చేశారు.

చివరకు ఈ పుకార్ల గురించి అభిమానులను, ఫాలోవర్లను శాంతింపజేస్తూ తాను రహస్యంగా వివాహం చేసుకున్నాను అంటూ వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని.. తాను ఎవరినీ రహస్యంగా వివాహం చేసుకోలేదని.. చేసుకోబోనని ఆమె ప్రమాణం చేశారు. ఈ పోస్ట్ తో కంగనా రహస్య వివాహం పుకార్లకు బ్రేక్ పడింది.చిరాగ్ పాస్వాన్‌తో తనకు ప్రేమాయణం సాగుతోందనే వార్తలను కంగనా తోసిపుచ్చిన కొద్ది రోజులకే ఆమె రహస్యంగా వివాహం చేసుకుంది అంటూ పుకార్లు రావడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే గతంలో చిరాగ్ తో తన రిలేషన్ గురించి కంగనా మాట్లాడుతూ.. చిరాగ్ నా స్నేహితుడు. అతన్ని చూసినప్పుడు నాకు ఒక స్నేహితుడే గుర్తుకు వస్తాడు. అక్కడ ఎలాంటి రొమాన్స్ లేదు, నిజాయితీగా చెబుతున్నాను. మా ఇద్దరికీ చాలా కాలంగా పరిచయం ఉంది… అతను 10 సంవత్సరాల క్రితం నాతో సినిమా చేశాడు. ఒకవేళ మా మధ్య రొమాన్స్ ఉండి ఉంటే, ఈపాటికే మాకు పిల్లలు ఉండేవారు,” అని స్పష్టం చేశారు.

కంగనా మరియు చిరాగ్ పాస్వాన్ కలిసి మొదటిసారిగా 2011 లో తన్వీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘మిలే నా మిలే హమ్’ అనే రొమాంటిక్ డ్రామాలో నటించారు. ఈ సినిమాతోనే చిరాగ్ నటుడిగా అరంగేట్రం చేయగా, కంగనా కథానాయికగా నటించారు. ఇందులో నీరూ బజ్వా, సాగరిక ఘట్గే కూడా నటించారు. ఇక కెరీర్ విషయానికి వస్తే, కంగనా చివరిగా ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో కనిపించారు. ఇందులో ఆమె మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.
Author Avatar
Verified Staff Journalist kiran varra1985@gmail.com